02-04-2025 03:56:33 PM
ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్షలు అమలయ్యేలా చూస్తాం
బాధితురాలి పక్షాన నిలబడతాం: ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్
నాగర్ కర్నూల్,(విజయక్రాంతి): నాగర్ కర్నూల్ జిల్లా ఉర్కొండపేట గుట్ట ప్రాంతంలో వివాహితపై జరిగిన సామూహిక అత్యాచార ఘటనలో ఏడు మంది నిందితులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ తెలిపారు. అత్యంత క్రూరంగా పాసవికంగా వ్యవహరించిన ఏ నిధులకు అతి త్వరగా కఠినాతి కఠిన శిక్ష అమలయేలా అన్ని విధాల ఆధారాలను సేకరించి కోర్టుకు సబ్మిట్ చేస్తామన్నారు. ఇలాంటి దేవాలయాలు జాతర తదితర అత్యధిక జన సమూహాల ప్రాంతాల్లో గస్తీ పెంచుతామని ఇలాంటి ఆకతాయిల చేష్టలను ప్రజలు పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.గ్యాంగ్ రేప్ (70(1)), క్రిమినల్ ఇంటిమిడేషన్ (351(3)), డాకాయిటీ (310(2)) కింద నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. గత నెల 29న ఉర్కొండలోని శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయానికి తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి దర్శనం చేసుకుని అక్కడే జాగరణ చేస్తూ నిద్రించారు. అనంతరం తన దూరపు చుట్టం ఆయన నెత్తితో కలిసి ఆలయానికి 100 మీటర్ల దూరంలో ఉన్న గుట్ట ప్రాంతానికి బహిర్భూమికి వెళ్లారు. దీన్ని గమనించిన నిందితులో అక్కడే వారిని అటకాయించి వెంట వచ్చిన వ్యక్తిని కాళ్లు చేతులు కట్టేసి వారి నుంచి మరో 60 మీటర్ల దూరంలో వివాహితను ఒకరి తర్వాత ఒకరు వరుసగా ఏడుగురు అత్యంత దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు.
స్పృహ తప్పి పడిపోయి దాహం వేస్తుందని అడిగినా కనికరించకుండా నిందితుడు కార్తీక్ వివాహిత నోట్లో మూత్ర విసర్జన చేశాడు. హరీష్ గౌడ్ అనే నిందితుడు ఫోటోలు, వీడియోలు తీసి పోలీసులకు చెప్తే మీ ఫోటోలు వైరల్ చేస్తాం... మిమ్మల్ని చంపేస్తామంటూ బెదిరింపులకు గురి చేసినట్లు పోలీసుల విచారణలో బయటపడింది. మొదటగా ఫిర్యాదు ఇచ్చేందుకు వెనకడుగు వేసిన బాధితురాలికి పోలీసులు బాసటగా నిలిచి ఫిర్యాదు స్వీకరించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. కల్వకుర్తి డివిజన్ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో సీసీ ఫుటేజీలను నిందితులు వాడిన సెల్ఫోన్ డేటా సంఘటనాస్థలి వద్ద వినియోగించిన మందు సీసాలు నిందితురాలి బట్టలు అన్ని రకాల ఆధారాలను సేకరించినట్లు తెలిపారు. నిందితులలో మారపాకుల అంజనేయులు (25), సాదిక్ బాబా (28), వాగులదాస్ మణి (మానికంఠ) (21), కార్తిక్ (20), మత్త మహేష్ గౌడ్ (28), హరీష్ గౌడ్ (23), మత్త అంజనేయులు గౌడ్ (24) ఉన్నారు. వీరిలో ఇద్దరు మాత్రమే వివాహం జరిగిన వారు ఉన్నారు. గతంలోనే అనేక క్రూరమైన నేరాలకు పాల్పడినట్లు ప్రాథమిక అంచనాకు వచ్చినట్లు మరిన్ని సాక్ష ఆధారాలను సేకరిస్తున్నామని తెలిపారు.