22-04-2025 12:00:00 AM
బెల్లంపల్లి అర్బన్, ఏప్రిల్ 21 : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన దొంగతన కేసులో పోలీసులు సోమవారం ముగ్గురిని అరెస్టు చేశారు. బెల్లంపల్లి రూరల్ సీఐ అఫ్జలుద్దీన్ నిందితులను అరెస్టు చూపించారు.
ఈనెల 18న రాత్రి కాల్ టెక్స్ ఏరియాలో దాసరి జ్యోతి అనే మహిళ ఇంట్లో పెండ్లి బారత్ జరుగుతున్న సమయంలో ఇదే అదునుగా భావించి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి సిరిగిరి స్వప్న, మరో ఇద్దరు మైనర్లు చొరబడి బంగారం, డబ్బులు దొంగతనం చేశారు. దొంగతనం చేసిన నిందితులను సీసీటీవీ కెమెరాల ఆధారంగా గుర్తించి అరెస్టు చేసినట్లు తెలిపారు. ఈ మేరకు నిందితులను కోర్టులో హాజరు పరిచారు.