calender_icon.png 7 March, 2025 | 12:58 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దొంగతనం కేసులో నిందితుడి అరెస్టు

06-03-2025 01:07:53 AM

జగిత్యాల అర్బన్, మార్చి 5 : ఊరికి దూరంగా ఉన్న చిన్న చిన్న దేవాలయాలే టార్గెట్ గా చేసుకొని వరుస చోరీలకు పాల్పడుతున్న ఓ నిందితున్ని జగిత్యాల టౌన్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. బుధవారం డిఎస్పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో  డిఎస్పి రఘుచందర్ వివరాలను వెల్లడించారు.

కోరుట్ల అన్నమయ్య గుట్టకు చెందిన ఊబిది శేఖర్ అనే వ్యక్తి జగిత్యాల వాణినగర్ ప్రాంతంలో ఒక బియ్యం సంచి తో అనుమానస్పదంగా కనిపించగా పోలీసులు సోదా చేయడంతో ఆ సంచిలో దేవాలయానికి సంబంధించిన వస్తువులు, నగలు కనిపించాయని దీంతో ఆ వ్యక్తిని పట్టుకుని విచారించగా గత నాలుగు రోజుల క్రితం ఉప్పరపేట దేవాలయం, నల్ల పోచమ్మ దేవాలయం లో చోరీకి పాల్పడ్డట్టు ఒప్పుకున్నాడని తెలిపారు.

ఊబిది శేఖర్ గత 8 సంవత్సరాలుగా సుమారు 25 ఇలాంటి తరహా దొంగతనాలకు పాల్పడగా 17 కేసుల్లో శిక్షలు కూడా పడ్డాయని తెలిపారు. ఇటీవలనే జైలు నుండి విడుదలై లక్ష్మి అనే మహిళతో కలిసి దొంగతనాలకు పాల్పడుతున్నాడని డిఎస్పి వివరించారు. తరచూ దొంగతనాలకు పాల్పడుతూ నేర ప్రవృత్తి మానకపోవడంతో అతనిపై సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేయడం జరిగిందని తెలిపారు. శేఖర్ తో పాటు దొంగతనానికి పాల్పడిన లక్ష్మి పరారిలో ఉన్నట్టు తెలిపారు.

అదేవిధంగా రెండు రోజుల క్రితం స్థానిక నర్సింగ్ కళాశాల హాస్టల్ లో సెల్ఫోన్ల దొంగతనంతో పాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో చోరీ కి యత్నించిన కేసులో ఓ బాల నేరస్తున్ని అరెస్టు చేసి జువైనల్ కోర్టులో హాజరు పరిచినట్లు డిఎస్పి తెలిపారు. నిందితుడి నుండి సుమారు రు.50వేల విలువైన చోరి సొత్తును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ సమావేశంలో టౌన్ సిఐ వేణుగోపాల్, ఎస్సు కిరణ్ ఉన్నారు.