రూ.17.60 లక్షల ఆభరణాలు, రూ.8.90 లక్షల నగదు స్వాధీనం
మహబూబాబాద్, జనవరి 8 (విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా నర్సిం మండల కేంద్రంలో జరిగిన భారీ చోరీ కేసును మహబూబాబాద్ పోలీసులు ఛేదించారు. నిందితుడిని బుధవారం అరెస్ట్ చేశారు. ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ మీడియాకు వివరాలు వెల్లడించారు. నర్సంహుల మండల కేంద్రానికి చెందిన ఏర్నాగి సీతారాములు ఈ నెల 6వ తేదీన ఇంటికి తాళం వేసి పొలం పనులకు వెళ్లాడు.
మధ్యాహ్నం ఇంటికి వచ్చే సరికి ఇంటి తలుపు తెరిచి ఉంది. లోనికి వెళ్లి చూడగా ఇంట్లోని బంగారం, వెండి అభరణాలు, నగదు చోరీ అయినట్టు గుర్తించాడు. మంగళవారం నర్సింహులపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు అన్ని కోణాల్లో విచారణ జరిపి అదే గ్రామానికి చెందిన రవి చోరీ చేసినట్టుగా గుర్తించి, బుధవారం అదుపులోకి తీసుకున్నారు. అతడి నుంచి రూ.17.60లక్షల విలువైన బంగారం, వెండి అభరణాలు, రూ.8.90లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు.