calender_icon.png 5 March, 2025 | 3:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కత్తి దాడి కేసులో నిందితుడి అరెస్టు

05-03-2025 12:37:28 AM

నిర్మల్; మార్చి 4 (విజయ క్రాంతి) : నిర్మల్ రూలర్ మండలంలోని రత్నాపూర్ కాలనీ తండాలో శ్రీకర్ పై కత్తితో దాడి చేసిన కేసులో నిందితుడు రాజును అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ రాకేష్ మీనా వెల్లడిం చారు. మంగళవారం స్థానిక పోలీస్ స్టేషన్లో వివరాలను వెల్లడించిన ఆయన ఆదివారం పెళ్లి అనంతరం నిర్వహించిన భారత్లో రాజు శ్రీకర్ మధ్య గొడవ జరిగిందన్నారు. రాజు మద్యం తాగి నృత్యంతో శ్రీకర్ అతన్ని నృత్యం చేయవద్దని వార్నింగ్ ఇచ్చారన్నారు.

తన ఊరిలో తనకు నృత్యం చేయవద్దని వార్నింగ్ ఇచ్చిన శ్రీకర్ పై కోపం పెంచుకున్న రాజు రాత్రి ఇంటికి వస్తుండగా మధ్యలో వాహనాన్ని ఆపి కత్తితో దాడి చేయడం జరిగిందని వెల్లడించారు. దాడి అనంతరం రాజు పారిపోగా అతని పోలీసులు పట్టుకొని అరెస్టు చేయడం జరిగిందని గాయపడ్డ శ్రీకర్ కోరుకుంటున్నాట్లు ఎస్పీ వెల్లడించారు. నిందితుని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ చేయడం జరిగిందన్నారు.