calender_icon.png 28 March, 2025 | 5:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హత్య కేసులో నిందితుడు అరెస్ట్‌

21-03-2025 11:49:31 AM

బిచ్కుంద,(విజయక్రాంతి): హత్య కేసులో ఒకరిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు కామారెడ్డి జిల్లా బిచ్కుంద సీఐ జగడం నరేష్(Kamareddy district Bichkunda CI Jagadam Naresh) తెలిపారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా బిచ్కుంద పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో హత్య కేసు వివరాలను వెల్లడించారు. బిచ్కుంద మండలం హస్గుల్ గ్రామంలో 2024లో జరిగిన హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు.

సీఐ నరేష్ కథనం ప్రకారం బిహార్ కు చెందిన మనీష్  కుమార్ యాదవ్ (17) ఏడాది క్రితం హస్గుల్ గ్రామంలోని ప్రవీణ్ వద్ద పనిలో చేరాడు. 2024 సెప్టెంబర్ 25న  అనుమానాస్పద స్థితిలో మృతి చెందడంతో కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు బిచ్కుంద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రేమ విషయంలో ఏర్పడిన వివాదం కారణంగా బిహార్  చెందిన అంటుకుమార్ హస్గుల్  వచ్చి మనీష్ కు మద్యం తాగించి హత్య చేసి పరారయ్యాడు. దర్యాప్తులో భాగంగా  నిందితుడిని అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు సీఐ తెలిపారు. ఈ సమావేశంలో ఎస్సై మోహన్ రెడ్డి, తదితరులు ఉన్నారు.