calender_icon.png 23 February, 2025 | 4:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇన్సూరెన్స్ కంపెనీలను మోసగించిన కేసులో నిందితుల అరెస్టు

20-02-2025 12:23:42 AM

నిజామాబాద్, ఫిబ్ర వరి 19 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ప్రముఖ షోరూంలో చెందిన ద్విచక్ర వాహనాలను గ్రామాల వారికి అమ్మేసి ఇన్సూరెన్స్ కంపెనీలను మోసం చేసి ఈయన కేసులో పలువురు అరెస్ట్ చేసినట్లు ఆర్మూర్ ఏసిపి వెంకటేశ్వర రెడ్డి తెలిపారు.

బుధవారం ఆర్మూర్ ఏసిపి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన నిందితుల వివరాలను వెల్లడించారు. హైదరాబాదులోని ఎల్బీనగర్ ప్రాంతంలోని ఆర్కే పురంలోగల హీరో ఫిన్ కార్ప్ లిమిటెడ్ నర్సరీ సేల్స్ మేనేజర్ షేక్ అబ్దుల్ రఫీ ఫిర్యాదు మేరకు నమోదైన కేసులో 9 మంది నిందితులుగా గుర్తించామని అందులో కొందరిని అరెస్టు చేసినట్లు ఏసిపి వెంకటేశ్వరరావు తెలిపారు.

హైదరాబాదులోని రాజేంద్రనగర్ మహమ్మదీయ కాలనీకి చెందిన సయ్యద్ ఉమర్ రాజేంద్రనగర్ లంగర్ హౌస్ హైదర్గూడా లోని క్షమాకాలని చెందిన షాజీద్ అలీ చార్మినార్ బషారత్ నగర్‌కు చెందిన షాబీర్ ఖాన్ అయాన్ అలియాస్ షాబాద్ ఖాన్ కామారెడ్డి లోని బర్కత్పురాకు చెందిన మహమ్మద్ యాసిన్ ఆర్మూర్ మండలం మిగతాపల్లికి చెందిన కళ్లెం యోగేష్‌రెడ్డి.

ఆర్మూర్ మండలం రాంపూర్‌కు చెందిన బంటు ప్రశాంత్ అంకాపూర్‌కు చెందిన కొమ్ముల వెంకటరెడ్డి సిరికొండ మండలం హుస్సేన్ నగర్ కు చెందిన తేనేటి నరేష్ రెడ్డి ధర్పల్లి మండలం మైలారం గ్రామానికి చెందిన కాటిపల్లి శ్రీకాంత్ రెడ్డిలను నిందితులుగా గుర్తించినట్లు ఏసీబీ వెంకటేశ్వర్లు తెలిపారు.

ఈ కేసులో నలుగురిని అరెస్టు చేయగా మిగతావారు పరార్‌లో ఉన్నట్టు ఏసీబీ తెలిపారు ఈ కేసీను దర్యాప్తు చేసిన ఆర్మూర్ ఎస్‌హెచ్‌ఓ సత్యనారాయణ ఎస్‌ఐలు ఇంద్రకరణ్ రెడ్డి గోవింద్ మహేష్ లను అభినందించారు.