07-03-2025 01:32:55 PM
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలం(Rajendranagar Mandal)లో భూకబ్జాకు పాల్పడిన నిందితులను శుక్రవారం పోలీసులు అరెస్ట్ చేశారు. ఎన్నారైకి చెందిన ఫ్లాట్ కు దుండగులు ఫోర్జరీ డాక్యుమెంట్లు క్రియేట్ చేశారు. ఈ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు బండ్లగూడ(Bandlaguda) లో ఫ్లాట్ ను రూ. 5 కోట్లకు విక్రయించేందుకు ప్రయత్నించాడు. నిందితుల నుంచి రూ. కోటి 60 లక్షలు, కార్లు స్వాధీనం చేసుకున్నారు.