17-03-2025 12:00:00 AM
ఖమ్మం: తెలంగాణా రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను చూసి ఓర్వలేకే బీఆర్‌ఎస్ పార్టీ నిందారోపణలు చేస్తున్నదని రాష్ట్ర మార్కెఫెడ్ మాజీ డైరెక్టర్,డీసీఎంఎస్ మాజీ చైర్మన్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు. ఇటీవల అసీంబ్లీలో దళితుడైన స్పీకర్‌ను మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ పాల్వంచలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు బీఆర్‌ఎస్ దిష్టి బొమ్మకు శవ యాత్ర చేశారు. దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. కేసీఆర్, కేటీఆర్ జగదీష్ రెడ్డి డౌన్ డౌన్, బీఆర్‌ఎస్ పార్టీ డౌన్ డౌన్, దళిత స్పీకర్ పై BRS అనుచిత వ్యాఖ్యలను ఖండించాలి అంటూ నినాదాలు చేసారు.
ఈ కార్యక్రమంలో పాల్వంచ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల రంగారావు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కోండం వెంకన్న, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పైడిపల్లి మహేష్, సొసైటీ డైరెక్టర్ చౌగాని పాపారావు, లేబర్ సెల్ చైర్మన్ సాదం రామకృష్ణ, కాంగ్రెస్ నాయకులు కాల్వ భాస్కర్ రావు, బాలినేని నాగేశ్వరరావు, నల్లమల్ల సత్యం, గంధం నర్సింహారావు, షేక్ చాంద్ పాషా, కాపర్తి వెంకటాచారి, కాపా శ్రీను, డిష్ నాగేశ్వరరావు, వాసుమల్ల సుందర్ రావు, రాములు నాయక్, ధర్మసోత్ ఉందెర్ నాయక్, మస్నా శ్రీను, సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ షఫి, మురారి పద్మ, మహ్మద్ రఫీ, వేము రాంబాబు, బుశెట్టి సాంబయ్య, జల్లారపు నాగేశ్వరరావు, Md అబ్దుల్, షఫి, కళ్యాణ్, బండి ఉదయ్, జూపూడి ప్రభాకర్, జమాల్ సైదులు తదితరులుపాల్గొన్నారు.