calender_icon.png 19 February, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఆరోపణలు

14-02-2025 12:22:25 AM

నారాయణఖేడ్, ఫిబ్రవరి 13 : నారాయణఖేడ్ ఎమ్మెల్యే చేపడుతున్న అభివృద్ధి పనులను చూసి ఓర్వలేక బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి చేస్తున్న ఆరోపణలు సరైనవి కావనీ కాంగ్రెస్ నాయకులు రమేష్ చౌహన్, న్యాయవాది సంగన్న, పండగ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు నాగభూషణ్, రెడ్డి అంజిరెడ్డి, వినయ్, బుసిరెడ్డి, సంగమేష్ పాటిల్ తెలిపారు.

గురువారం  నారాయణఖేడ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉన్నప్పుడు రోడ్లను పట్టించుకోలేదని ఆరోపించారు. ప్రజలను మభ్యపెట్టెందుకే ధర్నాలు చేపడుతున్నారని ఆరోపించారు. అనంతసాగర్, సత్యగమ్మ, చందాపూర్, జూకల్, గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేని సమయంలో మాజీ ఎమ్మెల్యే కృష్ణారెడ్డి కృషితో బీటీ రోడ్లు మంజూరు చేశారని గుర్తు చేశారు.