28-02-2025 05:14:51 PM
సామాజిక సేవా కార్యకర్తగంధం సైదులు..
మునగాల: జాతీయ రహదారి విస్తరణలో భాగంగా మునగాల, బరాకత గూడెం గ్రామాల్లో ఏర్పాటుచేసిన సర్వీసు రోడ్లపై కుప్పలు తిప్పలుగా ఉన్న మట్టి దిబ్బలను తీసివేయాలని సామాజిక సేవా కార్యకర్త గంధం సైదులు సంబంధిత ఆఫీసర్లను శుక్రవారం ఒక ప్రకటనలో కోరారు. గత సంవత్సర కాలం నుంచి సర్వీస్ రోడ్డుపై ఉన్న మట్టిని, చెత్తను తొలగించకపోవడం వల్ల వాహనాలు పోయే సమయంలో తీవ్రమైన దుమ్ము రావడంతో రోడ్డు పక్కన ఉన్న ఇంటి యజమానులు, షాపుల యజమానులు, రహదారిపై వెళ్లే వాహనదారులు సైతం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా శాశ్వత్కోశ వ్యాధులతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని తెలిపారు.
గత సంవత్సర క్రితం జిఎంఆర్ సంస్థ సిబ్బంది అప్పుడప్పుడు శుభ్రం చేసినప్పటికీ అంతగా దుమ్ము లేవలేదు అన్నారు. ఇటీవల కాలంలో జిఎంఆర్ సంస్థ కాంటాక్ట్ రద్దయినందున ఆ పని ఎన్ హెచ్ ఏ ఐ పరిధిలోకి వెళ్లిందని చెప్పారు. అట్టి శాఖకు చెందిన ఆఫీసర్లు పట్టించుకోకపోవడం శోచనీయమన్నారు. నేను గతంలో ఇట్టి విషయమై రెండు మూడు పర్యాయాలు సంబంధిత నేషనల్ హైవే అథారిటీ ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ శుభ్రం చేయిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఆచరణలో అమలు చేయలేదన్నారు. ఇట్టి సర్వీస్ రోడ్డును శుభ్రం చేయడం ఇటు గ్రామపంచాయతీ పరిధికానందున ఎన్హెచ్ఏఐ ఆఫీసర్లు వెంటనే స్పందించి సిబ్బందితో మట్టిని తొలగించి ప్రతి రోజు ట్యాంకర్ల ద్వారా నీటిని చల్లించాలని డిమాండ్ చేస్తున్నాను. లేనిపక్షంలో అట్టి మట్టి రోడ్డుపై కూర్చొని సర్వీస్ రోడ్డును ఉన్న దిగ్బంధం చేయడానికి వెనుకాడని తెలియజేస్తున్నాను. వెంటనే సంబంధిత ఆఫీసర్లు స్పందించి ఆయా గ్రామాల్లో ఉన్న సర్వీస్ రోడ్లపై ఉన్న మట్టిని తొలగించి రోజు నీటిని చల్లించాలని కోరుతున్నాను.