calender_icon.png 8 April, 2025 | 1:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వక్ఫ్ బోర్డు ఆస్తుల నిర్వహణలో జవాబుదారీతనం

06-04-2025 12:25:55 AM

బీజేపీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్

హైదరాబాద్, ఏప్రిల్ 5 (విజయక్రాంతి): వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు  2025 ఆమోదంతో వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో జవాబు దారీతనం, నైతికత పెరుగుతుందని బీజేపీ అధికార ప్రతినిధి తూళ్ల వీరేందర్ గౌడ్ పేర్కొన్నారు. దశాబ్దాల పాటు దేశాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకులు చేసిన చారిత్రక తప్పిదాలను దశాబ్దకాలం నరేంద్ర మోదీ పాలనలోని బీజేపీ ప్రభుత్వం సరిదిద్దుతుందన్నారు.

పాత చట్టాలలోని లోపా లను సవరిస్తూ నేడు భారతదేశాన్ని ప్రపంచ దేశాలలో ఉన్నత స్థితిలో నెలబెడుతున్నారని కొనియాడారు. న్యాయసూత్రాల కంటే మత విశ్వాసాలే ముఖ్యమని కాంగ్రెస్ పార్టీ తమ కు ప్రజలు కట్టబెట్టిన మెజార్టీని ఏ విధంగా ఉపయోగించుకుందో షాబానో కేసు ప్రత్యక్ష ఉదాహరణ పేర్కొన్నారు.

ఇదే తరహా విధానాన్ని వక్ఫ్ చట్టం విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ న్యాయ సూత్రాలకు అతీతంగా ఓటు బ్యాంకు రాజకీయాలు ముఖ్యమని వ్యవహరించినట్టు పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 8,68,054 వక్ఫ్ ఆస్తులలో 4,36,169 ఆస్తులకు సరైన రికార్డులు లేవన్నారు. వీటితో పాటు ఎలాంటి ప్రాతిపదిక లేకుండా గ్రామాలకు గ్రామాలు వక్ఫ్ ఆస్తులంటూ ప్రకటించడం దారుణమని వాపోయారు.