17-04-2025 12:02:01 AM
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి, ఏప్రిల్ 16 ( విజయక్రాంతి ) : చౌక ధర దుకాణాల్లో అకౌంట్ బుక్ పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. బుధవారం మధ్యా హ్నం చిట్యాల గ్రామంలోని చౌక ధర దుకాణానికి జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశా రు. దుకాణంలో ఉన్న బియ్యం నాణ్యతను పరిశీలించడంతో పాటు లబ్ధిదారులకు బియ్యం నాణ్యత పై అడిగి అభిప్రాయం తెలుసుకున్నారు.
ఇప్పుడు ఇస్తున్న సన్న ర కం బియ్యం నాణ్యత చాలా బాగుందని తినటానికి చాలా రుచికరంగా ఉందని లబ్ధిదా రులు సంతోషం వ్యక్తం చేశారు. చౌక ధర దుకాణం పరిధిలో ఎన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, మౌలిక వసతుల పై వివరాలు తెలుసుకున్నారు. అకౌంట్ బుక్ సరిగ్గా నిర్వహించాలని, లబ్ధిదారులకు బియ్యం ఇచ్చిన ట్టు రశీదులు సైతం ఇవ్వాలని డీలర్ ను ఆదేశించారు. తహసిల్దార్ రమేష్ రెడ్డి, ఆర్.ఐ. మధు సాగర్ కలెక్టర్ వెంట ఉన్నారు.