22-03-2025 12:00:00 AM
ఆప్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్
ముషీరాబాద్, మార్చి 21: (విజయక్రాంతి): రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలలో బడ్జెట్‌ను రాష్ట్ర ప్రభుత్వం తన ఎన్నికల మేనిఫెస్టోలో పొందు పరచిన విధంగా 15 శాతం పెంచాలని డిమాండ్ చేస్తూ ఏప్రిల్ 17న ధర్నా చౌక్ వద్ద మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ దిడ్డి సుధాకర్ తెలిపారు. విద్యకు 7.5 శాతం మాత్రమే కేటాయించడం సిగ్గు చేటన్నారు.
గత వారం రోజులుగా హిమాయత్నగర్, రామ్ నగర్, చంపాపేట, సాయిబ్ నగర్, బిఎనన్.రెడ్డి నగర్, రామంతపూర్ లోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆమ్ ఆద్మీ పార్టి సర్వె చేయడం జరిగిందన్నారు. క్లాసు రూములు టీచర్లు వున్నా, దాదాపు అన్ని స్కూల్స్ లో మంచి నీరు, పారిశుద్ధ కార్మికులు, అటెండర్లు, స్పోర్ట్స్ వసతులు సరిగా లేవన్నా రు.
స్కూల్ యునిఫారంలు ఇస్తున్నా కాళ్ళకు చెప్పులు లేకుండా ఏంతో మంది బాల బాలికలను చూస్తె బాధేస్తుందన్నారు. రాజధానిలోనే ఈ పరిస్థితి ఉంటే జిల్లా కేంద్రాలు, గ్రామాల్లో ఎలా ఉంటాయో ఊహించు కోవచ్చన్నారు.
ఆమ్ ఆద్మీ పార్టీ వాలంటీర్లచే రాష్ట్ర వ్యాప్తంగా భగత్ సింగ్, రాజ్ గురు సుఖ్ దేవ్ ల 94 వర్ధంతి ఐన మార్చి 23 నుండి రాజ్యాంగ నిర్మాత బిఅర్ అంబేద్కర్ జన్మదినం ఏప్రిల్ 14 వరకు ప్రభుత్వ విద్యాలయాలు, దవాఖానాల సర్వె పట్టడం జరుగుతుందన్నారు.
ఏప్రిల్ 15న ఆయా జిల్లాల కలెక్టర్ లకు అక్కడి స్కూల్స్, దవాఖానాల పరిస్థితి వివరిస్తూ మెమొరాండం సమర్పించడం జరుగుతుందన్నారు. నగరంలో వారం రోజుల పాటు జరిగిన స్కూల్స్ సర్వేలో యువజన నాయకులు విజయ్ మల్లంగి, మహిళా నాయకురాలు సుధారాణి, జావీద్ షరీఫ్, దొరపల్లి సతీష్ కుమార్, రాకేశ్ రెడ్డి, బాబులాల్ పవార్, రాకేశ్ పాల్గొన్నారు.