calender_icon.png 10 January, 2025 | 9:39 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాలికల హాస్టళ్లలో మహిళా ఐఏఎస్‌ల బస

10-01-2025 02:02:28 AM

టెలీ కాన్ఫరెన్స్‌లో సీఎస్

హైదరాబాద్, జనవరి 9 (విజయక్రాం తి): రాష్ర్టంలోని ప్రభుత్వ బాలికల సంక్షేమ హాస్టళ్లలో మహిళా ఐఏఎస్  అధికారులు  తనిఖీ చేసి, రాత్రివేళ బసచేస్తారని సీఎస్ శాంతికుమారి వెల్లడించారు. రాష్ర్టంలో 540 బాలికల సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయని, ఈ హాస్టళ్లలో విద్యాప్రమాణాలు పెంచడంతో పాటు ఇటీవల పెంచిన డైట్ చార్జీల ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందన్నారు.

హాస్టళ్లలో మహిళా ఐఏఎస్ అధికారుల తనిఖీలపై గురువారం సంబంధిత ఉన్నతాధికా రులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టళ్లలో తొలిదశలో 29 మంది మహిళా ఐఏ ఎస్‌లు సందర్శించి ప్రస్తుత పరిస్థితులను పరిశీలిస్తారన్నారు.

హాస్టళ్లలో విద్యా ప్రమాణాలను పెంపొందించడంతోపాటు, వీటిని మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు ప్రతిపాదనలు అందిస్తారని చెప్పారు. ఈనెల 25లోపు తొలిదశ తనిఖీలు పూర్తి చేస్తారని తెలిపారు. ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్, ఇతర అధికారులు పాల్గొన్నారు.