calender_icon.png 18 January, 2025 | 1:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెజాన్ సహకారంతో మీర్ఖాన్‌పేట్‌లో వసతులు

18-01-2025 01:48:54 AM

*  మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి

హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 17(విజయక్రాంతి): ప్రముఖ అంతర్జాతీయ అమెజాన్ సంస్థ రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్‌పేట్ గ్రామంలో మౌలిక వసతుల కల్పన కోసం పలు ప్రాజెక్టులు చేపట్టింది. ఆ సంస్థ సహకారంతో పబ్లిక్ పార్కు, రివర్స్ ఆస్మాసిస్ వాటర్ ప్యూరిఫయర్ సిస్టం, ఆరోగ్య ఉప కేంద్రానికి నూతన భవనం, స్వయం సహాయక బృందాల కోసం సమావేశ మందిరాన్ని నిర్మించారు.

వీటిని స్థానిక ఎమ్మెల్యే సబితారెడ్డి, అమెజాన్ గ్లోబల్ డేటా సెంటర్ ఆపరేషన్స్ వీపీ సెర్జియో లూరీరో, డేటా సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌ఈస్ట్ ఏడబ్ల్యూఎస్ సాజి పీకే, డేటా సెంటర్ ఆపరేషన్స్ డైరెక్టర్ ఇండియా ఆదిత్యచౌదరిలతో కలిసి ప్రారంభించారు.