మానవత్వం చాటుకున్న ఏనుగు సుదర్శన్‌రెడ్డి
ఘట్‌కేసర్, అక్టోబర్ 21: వైఎస్‌రెడ్డి ట్రస్ట్ చైర్మన్, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు రాసే అభ్యర్థులకు భోజనం, వసతి కల్పించి తన సేవాతత్వాన్ని చాటుకున్నారు. జంటనగరాలతో పాటు నగర శివారులో సోమవారం గ్రూప్-1మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలు రాసేందుకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది మంది తరలివచ్చారు.
వారికి భోజనం, వసతి సదుపాయా లు లభించక ఇబ్బందులు పడుతారని తెలుసుకున్న సుదర్శన్‌రెడ్డి ఘట్‌కేసర్‌తో పాటు నగరంలోని పలు చోట్లు అభ్యర్థులకు వసతి కల్పించి.. భోజనాలు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసి ఉద్యోగాలు సాధించాలనే లక్ష్యంతోనే తాను ఈ ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు. కార్యక్రమంలో వైయస్‌రెడ్డి ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు.