calender_icon.png 6 January, 2025 | 12:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పటాకులతో ప్రమాదాలు.. ఆసుపత్రికి బాధితులు

02-11-2024 02:11:29 AM

  1. సరోజినిదేవి కంటి దవాఖానకు బాధితుల క్యూ
  2. ప్రత్యేక బృందాలతో చికిత్స 

హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 1 (విజయక్రాంతి): దీపావళిని పురస్కరించుకొని పటాకులు కాల్చి పదుల సంఖ్యలో ప్రజలు గాయపడ్డారు. వారిలో అనేక మంది కళ్ల సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో బాధితులంతా చికిత్స కోసం సరోజినిదేవి కంటి ఆసుపత్రికి క్యూ కట్టారు.

గురు వారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు నగరంలోని పలు ప్రాంతాలతో పాటు ఇతర జిల్లాల నుంచి బాధితులు దవాఖానకు వచ్చి వైద్య పరీక్షలు చేయించుకుం టున్నారు. బాధితులకు వైద్యులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సేవలు అందిస్తున్నారు.  ప్రమాదానికి గురైన వారికి ప్రత్యేక వైద్య సేవలు అందించేందుకు 100 బెడ్లను సిద్ధంగా ఉంచినట్టు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ మోదిని తెలిపారు.

శుక్రవారం మధ్యాహ్నం వరకు 48 మంది వైద్య సేవలు పొందినట్టు సూపరింటెండెంట్ తెలిపారు. వారిలో 20 మంది పిల్లలు, 28 మంది పెద్దలు ఉన్నట్టు తెలిపారు. ఇదిలా ఉండగా, సాయంత్రం వరకు బాధితులు 54కు చేరుకున్నట్టు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి