calender_icon.png 8 January, 2025 | 2:24 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

న్యూ ఇయర్ కు వచ్చి.. తిరిగిరాని లోకాలకు..

03-01-2025 11:27:43 PM

బిల్డింగ్ పైనుంచి కిందపడి ఆర్మీ డాక్టర్ మృతి

కెప్టెన్ హోదాలో పనిచేస్తున్న శంకర్‌రాజ్‌కుమార్...

రాజేంద్రనగర్: ఆర్మీలో కెప్టెన్ హోదాలో డాక్టర్‌గా సేవలందిస్తున్న ఓ వ్యక్తి నూతన సంవత్సర వేడుకలకు ఇంటికి వచ్చి ప్రమాదవశాత్తు బిల్డింగ్ పైనుంచి కిందపడి దుర్మరణం చెందాడు. ఈ విషాదకర సంఘటన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. శుక్రవారం ఇన్‌స్పెక్టర్ హరికృష్ణారెడ్డి కేసు వివరాలు వెల్లడించారు. పుప్పాలగూడ ఆల్కపురి టౌన్‌షిప్‌లోని హాల్‌మార్క్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న డాక్టర్ శంకర్ రాజ్‌కుమార్ లక్నోలో భారత సాయుధ దళాలలో కెప్టెన్ హోదాలో డాక్టర్‌గా సేవలందిస్తున్నారు. ఇదిలా ఉండగా ఆయన నూతన సంవత్సర వేడుకల కోసం వచ్చాడు. రెండో తేదీ మధ్యాహ్నం సమయంలో ఆయన ఇంటి బాల్కనీలో ఉండగా ఏదో పెద్ద శబ్ధం రావడంతో ఇంట్లో ఉన్న ఆయన భార్య, పనిమనిషి బయటకు వచ్చి చూశారు.

గ్రౌండ్ ఫ్లోర్‌లో డాక్టర్ శంకర్‌రాజ్‌కుమార్ తీవ్ర గాయాలతో పడి ఉన్నాడు. వెంటనే ఆయనను స్థానికుల సాయంతో చికిత్స నిమిత్తం కిమ్స్ ఆస్పత్రికి తరలించగా పరిస్థితి విషమించి అదేరోజు రాత్రి మృతిచెందాడు. అయితే, డాక్టర్ రాజ్‌కుమార్ ప్రమాదవశాత్తు ఫోర్త్ ఫ్లోర్ నుంచి కిందపడి మృతిచెంది ఉండొచ్చని ఆయన భార్య, కుటుంబీకులు పోలీసులకు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం మృతుడి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.