calender_icon.png 27 December, 2024 | 12:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు చెరువులో పడి కార్మికుని మృతి

07-11-2024 01:29:41 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): బెల్లంపల్లి పట్టణంలోని పోచమ్మ ఎర్ర చెరువులో ప్రమాదవశాత్తు పడి 24 డిప్ ఏరియా కు చెందిన పులి రాజ్ కుమార్ (54) అని సింగరేణి కార్మికుడు మృతి చెందినట్లు తాళ్ల గురజాల ఎస్సై సిహెచ్.రమేష్ తెలిపారు. మృతుని భార్య పులి లలిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళవారం తన స్నేహితుని సోదరుని కర్మకాండలకు వెళుతున్నానని చెప్పి తిరిగి రాలేదన్నారు. చెరువులో గుర్తుతెలియని శవం కనిపించినట్లు వాట్సాప్ గ్రూపులో చూసి నిర్ధారించినట్లు తెలిపారు. చెరువులో స్నానం చేసే సమయంలో ప్రమాదవశాత్తు మునిగి మృతి చెందినట్లు మృతుని భార్య ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్సై తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రమేష్ చెప్పారు.