calender_icon.png 27 November, 2024 | 2:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రామగుండం అర్జీ -1 ఓపెన్ కాస్ట్-5 ప్రాజెక్ట్ యంత్రానికి ప్రమాదవశాత్తు మంటలు

27-11-2024 11:27:19 AM

పెద్దపల్లి, (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి సంస్థ ఆర్.జీ- 1 పరిధి ఓపెన్ కాస్ట్- 5 ప్రాజెక్టు లో రెండో షిఫ్ట్ లో సింధూ షావెల్ అనే యంత్రానికి ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు అంటుకున్నాయి. దీంతో ఈ సంఘటనలో పావెల్ యంత్రం చాలావరకు కాలిపోయింది. విషయం తెలుసుకున్న సింగరేణి సంస్థ అధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని, షావల్ యంత్రానికి అంటుకున్న మంటలను అదుపులోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ సంఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అధికారులు, కార్మికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఈ ప్రమాదానికి పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది. ఒక్కసారిగా జరిగిన ప్రమాదంపై సింగరేణి సంస్థ అధికారులు విచారణ ప్రారంభించారు.