calender_icon.png 2 January, 2025 | 9:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేకే5 గనిలో ప్రమాదవశాత్తు కార్మికుడి మృతి

18-09-2024 01:15:12 PM

గని ప్రమాదంగా గుర్తించాలని కార్మిక సంఘాల డిమాండ్-

మందమర్రి,(విజయక్రాంతి): ప్రమాదవశాత్తు కార్మికుడి మ్యాన్ రైడింగ్ పై నుండి కార్మికుడి మృతి చెందిన ఘటన ఏరియాలోని సింగరేణి కేకే5 గనిలో మంగళవారం రెండవ బదిలీలో చోటు చేసుకుంది. తీరి కార్మికులు తెలిపిన వివరాల ప్రకారం కేకే5 గనిలో కోల్ కట్టర్ గా విధులు నిర్వహిస్తున్న మోకెనపల్లి లక్ష్మణ్ రెండవ షిఫ్ట్ విధులు ముగించుకొని గని ఉపరితలానికి మ్యాన్ రైడింగ్ పై వస్తుండగా మార్గమధ్యలో ప్రమాదవశాత్తు జారీ కింద పడటంతో  వెనుకాల వస్తున్న తోటి కార్మికులు గమనించి కార్మికుడు మృతి చెందాడని భావించారు.

అయినప్పటికీ కార్మికుడుని ఎలాగైనా బ్రతికించాలని గని అధికారులకు సమాచారం అందించి ఉపరితలానికి తీసుకు వచ్చేందుకు స్ట్రక్చర్ లేకపోవడం కార్మికులు తమ చేతులమీదుగా గని ఉపరితలానికి తీసుకు వచ్చి  ఏరియాలోని కేకే డిస్పెన్సరి కి తీసుకురాగా ఆసుపత్రిలో డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో మెరుగైన వైద్యం కోసం రామకృష్ణపూర్ ఏరియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్దారించారు.మృతునికి భార్య కుమారుడు,కూతురు ఉన్నారు.కాగా ప్రమాదం సమాచారం అందుకున్న కార్మిక సంఘాల నాయకులు సలేంద్ర సత్యనారాయణ, భీమనాదుని సుదర్శన్,(ఏఐటీయూసీ) దేవి భూమయ్య,కాంపెల్లి సమ్మయ్య,(ఐఎన్ టియు సి),ఎస్ నాగరాజ గోపాల్,అల్లి రాజేందర్(సిఐటియు)లు ఆసుపత్రికి చేరుకుని ప్రమాద వివరాలను కార్మికులను అడిగి తెలుసుకున్నారు.

అనంతరం కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ భూగర్భ గనిలో మ్యాన్ రైటింగ్ పై జారి పడడంతో కార్మికులు ప్రమాద స్థలంలోనే మృతి చెందాడని కార్మికుని మృతిని గని ప్రమాదంగా గుర్తించి మృతునికి యాక్సిడెంట్ బెనిఫిట్స్ తో పాటు బ్యాంకు భీమా వర్తింపజేయాలని మృతుని డిపెండెంట్ కు సూటబుల్ ఉద్యోగం కల్పించాలని  డిమాండ్ చేశారు.అధికారులు బొగ్గు ఉత్పత్తిపై చూపెట్టిన శ్రద్ధ కార్మికుల రక్షణకు సౌకర్యాల కల్పనకు చూపెట్టడం లేదని ఆరోపించారు.గనిలో ప్రమాదం జరిగితే గాయపడ్డ కార్మికుడిని ఉపరితలానికి తీసుకు వచ్చేందుకు స్ట్రక్చర్ లేకపోవడం విచారకరమని యాజమాన్యం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

లక్ష్మణ్ మృతిని గని ప్రమాదంగా గుర్తించాలి

సిఐటియు నాయకులు సాంబారు వెంకటస్వామి అల్లి  రాజేందర్ -

ఏరియా లోని కేకే,5గనిలో మంగళవారం రెండో బదిలీలో ఎం లక్ష్మణ్ అనే కోల్ కట్టర్ కార్మికుడు విధులు ముగించుకుని మైన్ రైడింగ్ పై వస్తుండగా మార్గ మధ్యలో కింద పడిపోవడంతో అక్కడికక్కడే మృతి చెందాడని లక్ష్మణ్ మృతుని గని ప్రమాదంగా గుర్తించి బాధిత కుటుంబాన్ని యాజమాన్యం,ప్రభుత్వం ఆదుకోవాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) బ్రాంచ్ అధ్యక్ష కార్యదర్శులు సాంబారు వెంకటస్వామి అల్లి రాజేందర్ లు డిమాండ్ చేశారు.బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ గనిలో స్ట్రక్చర్ అందుబాటులో ఉంటే తొందరగా బాధిత కార్మికుడిని పైకి తీసుకువచ్చే అవకాశాలు ఉండేదని  స్ట్రక్చర్ లేకపోవడం శాపంగా మారిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికైనా కేకే5 గని యాజమాన్యం స్ట్రక్టర్ అందుబాటులో ఉంచాలని వారు డిమాండ్ చేశారు. కార్మికుడు అండర్ గ్రౌండ్ లోనే చనిపోయినందున  యాక్సిడెంట్ని గని ప్రమాదంగా గుర్తించి వారికి వచ్చే టర్మినల్ బెనిఫిట్స్,బ్యాంక్ ద్వారా వచ్చే ప్రమాద బీమాతో పాటు కుటుంబంలో ఒకరికి సూటబుల్ ఉద్యోగం ఇవ్వాలని  వారు డిమాండ్ చేశారు.అంటే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం తరఫున  సాయం ప్రకటించాలని వారు  డిమాండ్ చేశారు.మృతుని  కుటుంబానికి న్యాయం చేయాలని లేకుంటే సిఐటియు ఆధ్వర్యంలో  పోరాటం తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు.