calender_icon.png 19 April, 2025 | 5:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మంచంపై నుండి పడి మృతి

18-04-2025 08:56:17 PM

లక్షెట్టిపేట,(విజయక్రాంతి): అంగడి బజార్ కు చెందిన ఎస్కే నౌసర్ అలీ(42) వ్యక్తి ప్రమాదవశాత్తు నిద్రలో మంచంపై నుండి పడి మృతి చెందాడని అదనపు ఎస్సై రామయ్య శుక్రవారం ఒక తెలిపారు. ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం మృతుడు నిన్న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి రాత్రి తిని పడుకున్నాడు ఉదయం లేచి చూసేసరికి మంచం పైనుండి కింద పడి నుదిటి పై రక్తపు గాయం ఉండగా ఆసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు లావుగా ఉండటంతో ప్రమాదవశాత్తు మంచంపై నుండి పడిపోయి చనిపోయినట్లు మృతుడి భార్య నుర్జాన్ భేగం పిర్యాదు చేయగా లక్షెట్టిపేట ఎస్సై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేయడం జరుగుతుందని తెలిపారు.