calender_icon.png 8 April, 2025 | 1:05 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

07-04-2025 06:30:31 PM

నిజాంసాగర్ (విజయక్రాంతి): స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి వ్యక్తి చనిపోయిన సంఘటన నిజాంసాగర్ మండల కేంద్రంలోని బంజపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. నిజాంసాగర్ ఎస్సై తెలిపిన వివరాల ప్రకారం... బంజేపల్లి గ్రామానికి చెందిన గడ్డం బాగయ్య అనే వ్యక్తి మంజీరా నది చిన్నపూలు వద్ద స్నానానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో మునిగి చనిపోయినట్లు తెలిపారు. మృతుని కుటుంబీకుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.