లాహౌల్: ధుంధీలోని సౌత్ పోర్టల్ ఆఫ్ అటల్ టన్నెల్ సమీపంలో 20 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో మహారాష్ట్రకు చెందిన ఒక పర్యాటకుడు మరణించాడు. మృతుడిని ముంబైకి చెందిన అభిజీత్ పాటిల్ (30)గా గుర్తించారు. ఈ ప్రమాదంలో మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను మనాలిలోని లేడీ విల్లింగ్డన్ ఆస్పత్రి, సివిల్ ఆస్పత్రి, హరిహర్ ఆస్పత్రికి తరలించారని మనాలీ డీఎస్పీ కేడీ శర్మ వెల్లడించారు. పర్యాటకులు లాహౌల్ లోయ నుండి తిరిగి వస్తుండగా వాహనం రోడ్డుపై బోల్తా పడి పారాపెట్ను ఢీకొట్టింది. బస్సులో డ్రైవర్‌తో కలిపి 21 మంది టూరిస్టులు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం మార్చురీకి తరలించారు.