calender_icon.png 3 April, 2025 | 3:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్యే జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లో ప్ర‌మాదం

01-04-2025 11:26:35 PM

గుర్రంపోడు: నాగార్జునసాగర్ ఎమ్మెల్యే కుందూరు జైవీర్‌రెడ్డి కాన్వాయ్‌లోని ఓ స్కార్పియో ప్ర‌యాదానికి గురైంది. వాహనం అదుపుతప్పి రోడ్డు ప‌క్క‌కు దూసుకెళ్లి ప‌ల్టీకొట్టింది. న‌ల్ల‌గొండ జిల్లా గుర్రంపోడు మండలం చేపూర్ గ్రామ శివారులో మంగ‌ళ‌వారం ఈ ఘటన జరిగింది. గుర్రంపోడులోని ఆలయ వార్షికోత్సవాల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్యే వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వాహ‌నం అదుపుత‌ప్పి రోడ్డు వెంట ఉన్న‌ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మ‌ర్‌ను ఢీకొట్ట‌డంతో ఒక్క‌సారిగా మంట‌లు వ‌చ్చాయి. కారులోని ఇద్ద‌రికి స్వ‌ల్ప‌గాయాలైన‌ట్లు తెలిసింది. ప్రాణ‌న‌ష్టం జ‌ర‌గ‌క‌పోవ‌డంతో కాంగ్రెస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నాయి.