calender_icon.png 30 April, 2025 | 2:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

20 లక్షల ప్రమాద చెక్కు అందజేత

29-04-2025 08:31:40 PM

లక్షెట్టిపేట (విజయక్రాంతి): పట్టణంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లో 20 లక్షల ప్రమాద భీమా చెక్కును మంగళవారం ఏజీఎం రితీష్ బాధిత కుటుంబానికి అందించారు. ఏజీఎం రితీష్ తెలిపిన వివరాల ప్రకారం... గత మూడు నెలల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన దండేపల్లి మండలం రాజంపేట గ్రామానికి చెందిన ఎంబడి సాయికుమార్ అనే వ్యక్తి లక్షెట్టిపేట ఎస్బిఐ బ్రాంచ్ లో ఖాతాదారుడు, తన ఖాతాలో 1,000/-రూ. ప్రమాధ భీమా కలిగి ఉన్నందుకు గాను ఎస్బిఐ ఇన్సూరెన్స్ 20 లక్షల ప్రమాద భీమా చెక్కును స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్షెట్టిపేట బ్రాంచ్ ఏజీఎం రితీష్ చేతుల మీదుగా మంగళవారం మృతుడి కుటుంబానికి అందజేశారు.

ఈ సందర్భంగా ఎస్బిఐ రీజినల్ మేనేజర్ నితీష్ కుమార్, బ్యాంక్ మేనేజర్ ఆనంద్ హక్ లు మాట్లాడుతూ... ఖాతాదారులు ప్రతి ఒక్కరూ ఇలాంటి ప్రమాద భీమాలను కలిగి ఉండటం వలన కుటుంబానికి ఎంతో భరోసాను కల్పించిన వారు అవుతారాన్నారు. 1000/- రూ. లకే 20 లక్షల ప్రమాధ భీమా కాబట్టి కుటుంబంలో ప్రతి ఒక్కరూ కలిగి ఉండటం శ్రేయస్కరం అని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ అనిల్ కుమార్, బ్యాంకు సిబ్బంది శివకృష్ణ సత్యనారాయణ యాసిన్, ఖాతాదారులు, తదితరులు పాల్గొన్నారు.