22-02-2025 11:00:20 AM
హైదరాబాద్: శ్రీశైలం(Srisailam) ఎడమగట్టు కాలవ టన్నెల్ వద్ద శనివారం ప్రమాదం సంభవించింది. మూడు మీటర్ల మేర పైకప్పు పడిపోయింది. ఎడమవైపు సొరంగం 14వ కిలో మీటర్ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఉదయం 8.30 గంటలకు ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఎడమవైపు సొరంగం వద్ద 4 రోజుల క్రితం మళ్లీ పనులు మొదలయ్యాయి.