ఒకరి మృతి,మరో ముగ్గురికి గాయాలు
హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 20 (విజయక్రాంతి): జీడిమెట్ల పారిశ్రామికవాడలోని అరోరా ఫార్మా కంపెనీలో ప్రమాదం సంభవించింది. బుధవారం ఉదయం బాయిలర్ శుభ్రం చేస్తుండగా రసాయనాలు విడుదలై కార్మికుడు అనిల్(40) మృతి చెందగా, మరో ముగ్గురు కార్మికులు గోపి (23), శ్రీనివాస్(25), బలరామ్(30)లకు తీవ్ర గాయాలయ్యాయి. అప్రమత్తమైన ఫార్మా సిబ్బంది.. గాయపడ్డ కార్మికులను చికిత్స కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. మృతుడు అనిల్ బంధువులు కంపెనీ ముందు నిరసన చేపట్టారు. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు.