21-04-2025 01:02:44 AM
జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకుడు పోటు రవీందర్‌రెడ్డి
మంచిర్యాల, ఏప్రిల్ 20 (విజయక్రాంతి) : 2025-26 విద్యా సంవత్సరానికి రెప్యూటెడ్ (కార్పొరేట్) జూనియర్ కళాశాలల పథకం కోసం అర్హత గల జూనియర్ కళాశాలల నుంచి ఆన్ లైన్ లో దరఖా స్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఉప సంచాలకులు పోటు రవీందర్ రెడ్డి తెలిపారు. ఎస్‌సి., ఎస్‌టి, బిసి, ఈబిసి, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థినీ, విద్యార్థులకు ప్రైవేట్ జూనియర్ కళాశాలలో అడ్మిషన్లు కల్పించేందుకు జిల్లాలోని ప్రైవేట్ జూనియర్ కళాశాలల నుంచి రెప్యూటెడ్ జూనియర్ కళాశాలను నూత నంగా ఎంపిక చేసేందుకు రెసిడెన్షియల్ వసతి కలిగిన విద్యాబోధనలో ఉన్నత ప్రమాణాలు కలిగి, పోటీ పరీక్షలలో ఎక్కువ సంఖ్య ఉత్తీర్ణతా శాతం కలిగిన రెప్యూటెడ్ జూనియర్ కళాశాలల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామన్నారు.
ఆసక్తి గల కళాశాలలు తమ కళాశాలల ఐదు సంవత్సరాలకు సంబం ధించిన అకాడమిక్ ప్రొఫైల్ తో పాటు ఆన్ లైన్‌లో వెబ్‌సైట్ (https:// tela nganaepass. cgg.gov. in)లో కళాశాల ఈ-పాస్ యూజర్ ఐడి, పాస్వర్డ్‌తో లాగిన్ అయి ఈ నెల 30వ తేదీలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. ఆన్ లైన్ ప్రతిని మే 1వ తేదీ సాయంత్రం 5 లోగా జిల్లా షెడ్యూల్ కులముల అభివృద్ధి శాఖ కార్యాలయంలో సమ ర్పించాలని తెలిపారు.
కళాశాల బి.ఐ.ఈ. అనుబంధ ధృవీకరణ, భవనం, వసతి గృహ వివరాలు, తరగతి గదులు, భోజనశాల, వసతిగృహ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వివరాలు సమర్పించాలని, కళాశాల అకడమిక్ రికార్డు, ఇంటర్మీడిట్ ఫలితాలలో కళాశాల ఉత్తీర్ణత 90 శాతం, మొదటి శ్రేణిలో 50 శాతం ఉత్తీర్ణత కలిగి ఉండాలని తెలిపారు. ఐ.ఐ.టి., జె.ఈ.ఈ., ఎఇఇ., ఎంసెట్ పోటీ పరీక్షలలో సాధించిన ఫలితాల వివరాలు, ఫ్యాకల్టీ వివరాలు, వారి అనుభవం వివరాలు, కళాశాల ల్యాబ్, గ్రంథాలయ వివరాలు సమర్పించాలని తెలిపారు. ఎంపిక కాబడిన కళాశాలలో చదువుతున్న విద్యార్థులకు ట్యూషన్ ఫీజు క్రింద ప్రతి విద్యార్థికి 35 వేల రూపాయలు, పాకెట్ మనీ క్రింద 3 వేల రూపాయలు ప్రతి సంవత్సరం మంజూరు చేయడం జరుగుతుందని తెలిపారు.