హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 15 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో హౌసింగ్ సొసైటీ నూతన సభ్య త్వ నమోదుకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు సొసైటీ అధ్యక్షుడు మామిడి సోమయ్య, ప్రధాన కార్యదర్శి బొల్లం శ్రీనివాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ పత్రికలు, టీవీ న్యూస్ ఛానళ్లలో పనిచేస్తున్న జర్నలిస్టులు విజ్ఞప్తి మేరకు ఈనెల 18 నుంచి 25 వరకూ సభత్వ నమోదు చేపడుతున్నట్లు సోమయ్య తెలిపారు.
స్థానికంగా వర్కింగ్ జర్నలిస్ట్‌గా కనీసం ఐదేళ్ల అను భవం ఉండి, ప్రస్తుతం జర్నలిస్ట్‌గా పనిచేస్తున్నట్టుగా సంబంధిత గుర్తింపు కార్డు, అక్రిడిటేషన్ కార్డు, మీడియా సంస్థ నుంచి అపాయిమెంట్ లెటర్, స్థానికత ధ్రువీకరణ కోసం ఆధార్, గ్యాస్, విద్యుత్ బిల్లుతో పాటు రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో పాటు ‘గ్రేటర్ హైదరాబాద్ జర్నలిస్ట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కో హౌసింగ్ సొసైటీ’ పేరిట రూ.1,550 బ్యాంక్ డిమాండ్ డ్రాప్ట్ (డీడీ) దరఖాస్తుకు జత చేయాలన్నారు.
వనస్థలిపురం లోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి సమీపంలోని టీవీ కాలనీ ఫేస్ ప్లాట్ నంబర్ 198లో గల సొసైటీ కార్యాలయంలో ఉద యం 10 నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు. వివరాలకు 91009 33723, 77996 81212, 93933 53519 నంబర్లలో సంప్రదించాలన్నారు.