10 June, 2026 | 3:01 AM

ప్రీప్రైమరీ స్కూల్స్‌కు దరఖాస్తుల స్వీకరణ

10-06-2026 01:10 AM

నాగల్గిద్ద, జూన్ 9: నాగల్గిద్ద మండలంలోని కరస్గుత్తి, దామరగిద్ద, నాగల్గిద్ద, కారముంగి గ్రామాల్లో నూతనంగా మంజూరైన ప్రీ-ప్రైమరీ పాఠశాలలలో టీచర్,  ఆయా పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు మండల విద్యాధికారి మన్మధ కిషోర్ తెలిపారు. టీచర్ పోస్టులకు ఇంటర్  ఉత్తీర్ణులైన అభ్యర్థులు, ఆయా పోస్టులకు కనీసం 7వ తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తమ దరఖాస్తులను అవసరమైన విద్యార్హతల ధ్రువపత్రాలతో పాటు నాగల్గిద్ద మండల వనరుల కేంద్రం కార్యాలయంలో జూన్ 13వ తేదీలోగా సమర్పించాలని సూచించారు.