calender_icon.png 9 January, 2025 | 5:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మూసీ ప్రక్షాళన పనులు వేగవంతం

04-08-2024 02:27:03 AM

రూ. 3849 కోట్లతో ఏకకాలంలో 39 ఎసీటీపీల నిర్మాణం 

సర్వే పనులను ప్రారంభించిన అధికారులు

హైదరాబాద్ సిటీబ్యూరో, ఆగస్టు 3 (విజయక్రాంతి): మూసీ నదికి పూర్వ వైభవం తీసుకొస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిశగా కార్యచరణను మరింత వేగవంతం చేసింది. ఇప్పటికే మూసీపై డ్రోన్ సర్వే చేపట్టి, మూసీ పరీవాహక ప్రాంతంలో ఆస్తుల వివరాలను లెక్కించేందుకు రెవెన్యూ అధికారులతో సర్వే ప్రారంభించింది. తాజాగా జీహెచ్‌ఎంసీ, ఓఆర్‌ఆర్ పరిధిలోని స్థానిక సంస్థల అవసరాలతో పాటు మూసీ నది ప్రక్షాళన చేసేందుకు ఏకంగా రూ. 3,849.10 కోట్ల వ్యయంతో ఏక కాలంలో 39 ఎస్‌టీపీలను నిర్మా ణం చేసేందుకు సన్నద్ధమైంది. మూడు ఫేజ్‌లలో నిర్మాణం చేయనున్న మొత్తం 39 ఎస్‌టీపీలను అమృత్ 2.o పథకం కింద నిర్మించ నున్న ఈ ప్రాజెక్టులో ఒక ఎస్‌టీపీని పీపీపీ మోడ్‌లో, మిగతా 38 ఎస్‌టీపీలను హెచ్‌ఏఎం విధానంలో నిర్మించనున్నట్టు సమాచారం. మొత్తం రెండు ప్యాకేజీలలో ఈ ఎస్‌టీపీల నిర్మాణం చేయనున్నారు. ఈమేరకు మున్సిపల్ ప్రిన్సిపల్ సెక్రటరీ దానకిషోర్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.