calender_icon.png 3 November, 2024 | 2:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నర్సింగ్ అడ్మిషన్లను వేగవంతం చేయండి

03-11-2024 12:02:23 AM

వైద్యాధికారుల సమీక్షలో మంత్రి రాజనర్సింహా

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): రాష్ట్రంలో15 మెడికల్ కాలేజీలకు అనుబంధంగా ఏర్పాటు చేసిన నర్సింగ్ కా లేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియను వేగంగా చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి దా మోదర్ రాజనర్సింహా అధికారులను ఆదేశించారు. కాలేజీల్లో మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. శనివారం రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.

జనగామ, భూపాలపల్లి, కరీంనగర్, కొడంగల్, ఆందోల్, ఆసిఫాబాద్, మెదక్, కుత్బు ల్లాపూర్, ములుగు, నారాయణపేట, నిర్మల్, రామగుండం, మహేశ్వరం, నర్సంపేట, యా దాద్రిలో ఏర్పాటు చేసిన నర్సింగ్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తిచేసి తరగతులు ప్రారంభిం చాలని ఆదేశించారు. హె ల్త్ సెక్రటరీ క్రిస్టినా జెడ్ చోంగ్తూ, అధికారులు పాల్గొన్నారు.