04-04-2025 12:00:00 AM
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఏప్రిల్3 ( విజ యక్రాంతి): జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడు లు నిర్వహించడంతో సంచలనం రేగింది. బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు చెక్‌పోస్ట్ వద్ద నిఘా పెట్టి మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దు మీదుగా రాకపోకలు కొనసా గిస్తున్న వాహనాల నుంచి ఆర్టిఏ చెక్‌పోస్ట్ వద్ద ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
రవాణా శాఖకు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు వాహనాల నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద రూ:45,100 నగదును స్వాధీన పరచుకున్నట్లు కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. తనిఖీలు చేపడుతుండగా విధుల్లో ఏఎంవీఐ మాధవి ఉన్నట్లు ఆయన తెలిపారు.
అక్రమ వసూళ్లపై ఏసీబీ అధికారులు మాధవి లత ను విచారిస్తున్నారు. వాహనాల వద్ద డబ్బు లు వసూలు చేస్తున్నారు ఐలయ్య ఆలియా స్ రవి, విజయ్ కుమార్‌లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.