calender_icon.png 8 January, 2025 | 8:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు మళ్లీ ఏసీబీ పిలుపు

07-01-2025 01:35:31 AM

  1. న్యాయవాదిని అనుమతించకపోవడంతో విచారణకు హాజరుకాని బీఆర్‌ఎస్ నేత 
  2. 9న రావాలని మరోసారి ఏసీబీ నోటీసులు
  3. హైకోర్టు తీర్పు రిజర్వ్‌లో ఉన్నందున ఈడీ విచారణకు రాలేనన్న కేటీఆర్
  4. క్వాష్ పిటిషన్‌పై నేడు ఉదయం 10.30 గంటలకు హైకోర్టు తీర్పు

హైదరాబాద్, జనవరి 6 (విజయక్రాంతి): ఫార్ములా ఈ-కారు -రేస్ కేసు విచారణలో భాగంగా బీఆర్‌ఎస్ వర్కిం గ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు సోమవారం బంజారాహిల్స్‌లోని ఏసీబీ కార్యాలయానికి చేరుకున్న సందర్భంగా అనూ హ్య పరిణామాలు చోటుచేసుకున్నా యి. నందినగర్‌లోని తన నివాసం నుంచి బీఆర్‌ఎస్ లీగల్ టీమ్‌తో కలిసి ఆయన మొదట తెలంగాణ భవన్ వెళ్లారు.

ఆ తర్వాత ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ బారీకేడ్లు పెట్టి పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. కార్యాలయం లోపలికి తన వెంట లాయర్లను కూడా అనుమతించాలని అక్కడి పోలీసు అధికారులను కోరారు. అందుకు వారు అంగీకరించకపోవడంతో, అక్కడ కొంత ఉద్రిక్త పరి స్థితి తలెత్తింది. లాయర్ల బృందం లేనిదే తను విచారణకు హాజరుకానంటూ కేటీఆర్ తిరిగి వెళ్లిపోయారు.

కాగా కేటీఆర్ విచారణకు హాజరుకాకుండానే తిరిగి వెళ్లిపోవడం  చర్చనీయాంశంగా మారింది. ఏసీబీ విచారణ నోటీసులను లెక్క చేయకుండా కేటీఆర్ విచా రణకు హాజరుకాకపోవడం వెనుక గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల బలమే కారణమని అంటున్నారు. ఏదైనా కేసు విచారణ సమయంలో.. నిందితుల స్టేట్‌మెంట్ రికార్డ్ చేసేటప్పుడు వారి తరఫున న్యాయవాది కూడా ఉండాల్సిందేనని గతంలో సుప్రీంకోర్టు తీర్పునివ్వడాన్ని కేటీఆర్ లీగల్ టీం ప్రస్తావిస్తోంది.

కేటీఆర్ తమపై చేసిన ఆరోపణలపై స్పందించిన ఏసీబీ.. కేటీఆర్ క్వాష్ పిటిషన్ తీర్పు కోర్టులో రిజర్వులో ఉన్నప్పటికీ తీర్పు ఇచ్చేంత వరకు విచారణ చేసుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేస్తున్నారు. కేటీఆర్ ఆరోపణలపై కోర్టులో మెమో వేస్తామని అన్నారు.

కేటీఆర్ వెంట లాయర్లను అనుమతించే అంశంలో పైకోర్టు ఆదేశాలులేవని స్పష్టం చేశారు. ఇందుకు ఏసీబీ అధికారులు కౌంటర్ ఇచ్చా రు. సోమవారం సాయంత్రం గచ్చిబౌలిలో ని ఓరియన్ విల్లాకు వెళ్లిన ఏసీబీ అధికారు లు  కేటీఆర్‌కు ౯న హాజరు కావాలని మరోసారి నోటీసులు జారీ చేశారు.  

క్వాష్ పిటిషన్‌పై నేడు హైకోర్టు తీర్పు..

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై నేడు హైకో ర్టు తీర్పు వెల్లడించనుంది. ఫార్ములా ఈ కార్ రేసింగ్‌లో జరిగిన ఆర్థిక అవకతవకలపై కేటీఆర్‌పై ఏసీబీ కేసు నమోదు చేయగా.. ఈ కేసును కొట్టి వేయాలని కేటీఆర్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు.

ఈ పిటిషన్‌పై ఇటీవల వాదనలు ముగియగా.. న్యాయస్థానం తీర్పు రిజర్వులో ఉంచింది. తీర్పు వెల్లడించే వరకు అరెస్టు చేయవద్దని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో మంగళవా రం ఉదయం 10:30కు హైకోర్టు తీర్పు వెల్లడించనుంది. అయితే కోర్టు తీర్పుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 

నేడు ఈడీ విచారణకు రాలేను..

ఈడీ కేసుపై కేటీఆర్ స్పందించారు. ఏసీ బీ తనపై నమోదుచేసిన ఎఫ్‌ఐఆర్‌ను రద్దుచేయాలని ఇప్పటికే హైకోర్టులో వేసిన కేసు లో తీర్పు రిజర్వులో ఉందని.. కోర్టుపైన ఉన్న గౌరవంతో హైకోర్టు తీర్పును వెలువరించేంతవరకు ఈ అంశంలో తనకు సమ యం ఇవ్వాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ని కేటీఆర్ కోరారు. మంగళవారం తను ఈడీ విచారణకు హాజరుకావడం లేద ని స్పష్టంచేశారు.

కాగా.. జనవరి 7న విచారణకు రావాలని వారం రోజుల క్రితం కేటీఆ ర్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిం దే. ఐఏఎస్ అధికారి అర్వింద్ కుమార్, హెచ్‌ఎండీఏ మాజీ సీఈ బీఎల్‌ఎన్ రెడ్డికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. ఇద్దరు అధికారు లు ఈ నెల 2, 3వ తేదీల్లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నా పలు కారణాలతో హాజరుకాలేదు. ఇప్పుడు కేటీఆర్ సైతం కోర్టు తీర్పు రావల్సి ఉందంటూ ఈడీ విచారణకు హాజరుకావడం లేదు. దీనిపై ఈడీ నుంచి స్పందన రావాల్సి ఉంది.