calender_icon.png 9 January, 2025 | 3:32 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఏఈఈ నిఖేశ్ కస్టడీ కోరిన ఏసీబీ

03-12-2024 03:21:52 AM

హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 2 (విజయక్రాంతి): అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇరిగేషన్ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) నిఖేశ్ కుమార్‌ను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఏసీబీ సోమవారం రంగారెడ్డి కోర్టును కోరింది.  మే 30 న రంగారెడ్డి ఇరిగేషన్ కార్యాలయంలో లంచం తీసుకుంటూ ఈఈ బన్సీలాల్, ఏఈ కార్తీక్‌తో పాటు ఏఈఈ నిఖేశ్ కుమార్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు.

ఈ కేసులో ఏఈ ఈ జైలుకు వెళ్లి బయటకు వచ్చినా, ఆయన తన పద్ధతులు మార్చుకోలేదు. ఆయన కదలికలపై ఏసీబీ నిఘా కొనసాగుతూనే ఉంది. గత నెల 30న ఏసీబీ గండిపేట పెబెల్ సిటీలోని ఏఈఈ నివాసంతో పాటు ఆయన స్నేహితుల నివాసాల్లో సోదా చేపట్టింది.  ఏఈఈకి సంబంధించిన స్థిర, చరాస్తులకు చెందిన కీలకమైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని, అలాగే మొత్తం ౮ బ్యాంక్ లాకర్ల ను గుర్తించినట్టు సమాచారం. ఏఈఈ ఆస్తు ల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.200 కోట్లకు పైగా ఉంటుందని ఏసీబీ అంచనా వేస్తున్నది.

శనివారం నిఖేశ్‌ను అదుపులోకి తీసుకున్న ఏసీబీ ఆదివారం ఉదయం జడ్జి ముందు హాజరుపరిచింది. జడ్జి నిందితుడికి 14 రోజుల రిమాండ్‌ను విధించింది. త్వర లో నిందితుడు, ఆయన కుటు ంబసభ్యుల సమక్షంలో ఏసీబీ అధికారులు బ్యాంక్ లాకర్లను తెరిపిస్తారని సమాచారం. కాగా, నిఖేశ్ కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా,  కేసు దర్యాప్తులో ఉన్నందున బెయిల్ ఇవ్వొద్దని, అలాగే కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు నిందితుడిని తమ కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ అధికారులు పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.