హైదరాబాద్,(విజయక్రాంతి): మదాపూర్ లోని గ్రీన్ కో కార్యాలయం(Green Co office)లో అవినీతి నిరోధక శాఖ(Anti-Corruption Department) అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు నిర్వహిస్తున్నారు. గ్రీన్ కో అనుబంధ సంస్థ ఏస్ నెక్ట్స్ జెన్(Green Co subsidiary Ace Next Gen)లోనూ ఏసీబీ తనిఖీలు(ACB searches) చేసింది. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కుంభకోణంలో గ్రీన్ కో అనబంధ సంస్థలఎన్నికల బాండ్ల కొనుగోలు వ్యవహారం బయటకు వచ్చింది. దీంతో ఫార్ములా ఈ-రేస్ ఒప్పండానికి ముందు ఎన్నికల బాండ్ల రూపంలో బీఆర్ఎస్ రూ.41 కోట్లు ఇచ్చినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.2022 అక్టోబర్ 25వ తేదీన ఈ-రేసు నిర్వహించేందుకు మొదటి ఒప్పందం జరగగా, అదే ఏడాది ఏప్రిల్ లో రూ.31 కోట్లు, అర్టోబర్ లో రూ.10 కోట్లు ఎన్నికల బాండ్ల కొనుగోలుపై ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు. అటు ఆంధ్రప్రదేశ్ లోని మచిలీపట్నం గ్రీన్ కో ఎనర్జీ కార్యాలయంలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. తనిఖీల కోసం 10 మంది అధికారుల బృందం మచిలీపట్నం వెళ్లింది.