హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా శనివారం ఉదయం 6 గంటల నుంచి ఏసీబీ అధికారులు 30 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. నీటిపారుదల శాఖ ఏఈఈ నిఖేశ్ కూమార్ నివాసంతో పాటు వారి బంధువుల ఇళ్లలోను ఏసీబీ అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏఈఈ నిఖేశ్ కుమార్ కు సంబంధించి అధికారులు భారీగా ఆస్తులు గుర్తించారు. ఏఈఈ నిఖేశ్ కుమార్ కు రూ.150 కోట్ల వరకు ఆస్తులు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. నిఖేశ్ ఇంట్లో భారీగా డబ్బు, నగలు, బంగారు ఆభరణాలు, ఏఈ నిఖేశ్ పేరిట పలు ఫామ్ హౌజ్ లు, వ్యవసాయ భూములు, పలు ఇళ్లు, ప్లాట్లు, అపార్ట్ మెంట్లు ఉన్నట్లు గుర్తించారు. మూడు ఫాంహౌజ్ ల విలువ రూ. 80 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ప్రస్తుతం ఏఈ నిఖేశ్ కుమార్ సస్పెన్షన్ లో ఉన్నారు. మే నెలలో లంచం తీసుకుంటూ నిఖేశ్ కుమార్ ఏసీబీకి చిక్కాడు. రంగారెడ్డి జిల్లా ఎస్ఈ కార్యాలయంలో 6 నెలల క్రితం ఏసీబీ దాడులు నిర్వహించింది. ఓ దరఖాస్తుదారుడి దగ్గర అధికారులు రూ. 2.50 లక్షల లంచం డిమాండ్ చేశారు. లంచం తీసుకుంటూ ఈఈ బన్సీలాల్, ఏఈ నిఖేశ్ కుమార్, కార్తిక్ ఏసీబీకి చిక్కారు.