13-03-2025 12:00:00 AM
నిజామాబాద్, మార్చి 12 (విజయక్రాంతి) : నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూలు జరుగుతున్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు తమ దర్యాప్తు ఉమ్మరం చేశారు.ఏజెంట్లను నియమించుకొని వారి ద్వారా నిత్యం పెద్ద ఎత్తున అక్రమ వాసులకు పాల్పడుతున్నట్టు అధికారులు గుర్తించారు. బుధవారం నిజామాబాద్ రవాణా శాఖ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు సుదీర్ఘంగా హోదాల నిర్వహించారు. ఈ సోదాల్లో 27 వేల రూపాయల లెక్క చూపని నగదును కలిగి ఉన్న ఏజెంట్ ఎండి ఖలీల్ నుండి డబ్బు స్వాధీనం చేసుకున్నారు. అతడు వద్ద గల వివిధ వాహనాలకు చెందిన 14 సంబంధిత ఒరిజినల్ ఆర్ సి పత్రాలను ముగ్గురు వ్యక్తుల తాలూకా డ్రైవింగ్ లైసెన్స్ లను జప్తు చేశారు.
ఏజెంట్ ఖలీల్ నుండి ఏ అధికారులకు సంబంధాలు ఉన్నాయి ఎవరికి అనుసరణలో అతని పని చేస్తున్నాడు అనే విషయమై ఏసీబీ అధికారులు తమ విచారణను కొనసాగిస్తున్నారు. రవాణా శాఖ కార్యాలయంలో అధికారులు ప్రైవేటు వ్యక్తుల ద్వారా వివిధ రూపాల్లో డబ్బులు వస్తువులకు పాల్పడుతూ తమ అక్రమ కార్యక్రమాలను సాగిస్తున్నారు. ఒక్కో పనికి ఒక రేటు నిర్ణయించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారు. ఏజెంట్ ఖలీల్ నుండి నగల్ తో పాటు పత్రాలను స్వాధీనం చేసుకున్న ఏసీబీ అధికారులు తమ దర్యాప్తును వివిధ కోణాల నుండి సాగిస్తున్నారు.
ఈ విషయమై ప్రభుత్వానికి నివేదిక అందిస్తామని అవినీతి నిరోధక శాఖ విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది రవాణా శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న పలువురు అధికారులపై కేసు నమోదు చేయడమా లేదా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం అనేది వేచి చూడాల్సిన విషయం ఏసీబీ అధికారుల దాడుల నేపథ్యంలో నిత్యం రద్దీగా ఉండే రవాణా శాఖ కార్యాలయం నిర్మానుష్యంగా మారింది. ఆర్టిఏ కార్యాలయ ప్రధాన గేట్లు మూసేసి తమ దర్యాప్తు ను ఏసీబీ అధికారులు కొనసాగించారు.