calender_icon.png 26 April, 2025 | 1:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం ఈఎన్‌సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ సోదాలు

26-04-2025 09:05:22 AM

హైదరాబాద్: కాళేశ్వరం ఈఎన్సీ హరిరామ్ ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB officials) సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ షేక్ పేటలోని ఆదిత్య టవర్స్ లోని హరిరామ్ నివాసంలో శనివారం తెల్లవారుజాము నుంచి ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. హరిరామ్  కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీగా ఉన్నారు. గజ్వేల్ ప్రాంత ఈఎన్సీగా పనిచేస్తున్న హరిరామ్ ఇంట్లో సోదాలు. కాళేశ్వరం(Kaleshwaram Project) అనుమతులు, రుణాల్లో హరిరామ్ కీలకంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలోనే కీలక పత్రాలు, కంప్యూటర్లు, హార్డ్ డిస్క్ లను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. హరిరామ్ భార్య అనిత కూడా నీటిపారుదల శాఖలో డిప్యూటీ ఈఎన్ సీగా విధులు నిర్వహిస్తున్నారు. అనిత ప్రస్తుతం వాలంతరి డైరెక్టర్ జనరల్ బాధ్యతల్లో ఉన్నారు. కాళేశ్వరంపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేదికతో హరిరామ్ నివాసంలో అధికారులు సోదాలు చేస్తున్నట్లు సమాచారం.