calender_icon.png 7 February, 2025 | 3:17 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ట్రాన్స్‌పోర్ట్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ సోదాలు

07-02-2025 12:54:41 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): ట్రాన్స్‌పోర్ట్ డీటీసీ పుప్పాల శ్రీనివాస్(Transport DTC Puppala Srinivas) ఇంట్లో ఏసీబీ అధికారులు(ACB officials) శుక్రవారం సోదాలు నిర్వహించారు. ఆదాయానికి మించిన ఆస్తులున్నాయనే ఆరోపణలతో డీటీసీ శ్రీనివాస్ పై కేసు నమోదైంది. హైదరాబాద్, జగిత్యాలలోని శ్రీనివాస్ బంధువుల ఇళ్లలోనూ అధికారు తనిఖీలు చేశారు. పెద్ద ఎత్తున అక్రమ ఆస్తులను కూడ పెట్టాడని డీటీసీ శ్రీనివాస్పై ఆరోపణలు రావడంతో ఇవాళ సోదాలు జరిపిన ఏసీబీ అధికారులు రూ.50 కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్లు గుర్తించారు. హైదరాబాద్, జగిత్యాల, వరంగల్ తో పాటు 8 చోట్ల ఏసీబీ అధికారుల తనిఖీలు నిర్వహించారు.