24-02-2025 05:37:17 PM
బిల్ కలెక్టర్ మధు, అసిస్టెంట్ రమేష్ ను అదుపులోకి తీసుకున్న అధికారులు..
రూ 45,000 లంచం తీసుకుంటుండగా పట్టుకున్న ఏసీబీ..
రాజేంద్రనగర్: సర్కిల్ పరిధిలోని మైలార్ దేవ్ పల్లి వార్డు ఆఫీస్ లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బిల్ కలెక్టర్ మధు, ఆయన అసిస్టెంట్ రమేష్ 45 వేలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వివరాలు.. రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్దేవ్ పల్లి డివిజన్ పరిధిలోని ఇందిరాగాంధీ సొసైటీలో అక్రమంగా నిర్మించిన షెడ్డుకు సంబంధించి ఆస్తి పన్ను పెంచకూడదంటే లక్ష రూపాయలు ఇవ్వాలని బిల్ కలెక్టర్ మధు డిమాండ్ చేశాడు. లంచం ఇస్తేనే డోర్ నెంబర్ ఇస్తాను అని బెదిరింపులకు పాల్పడ్డాడు.
చివరగా యజమాని 45000 ఇచ్చేందుకు అంగీకరించాడు. సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు 45000 రూపాయలను బిల్ కలెక్టర్ మధు సహాయకుడు రమేష్ స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అతడికి రసాయనిక పరీక్ష నిర్వహించగా లంచం తీసుకున్నట్లు నిర్ధారణ అయింది. ఈ మేరకు ఏసీబీ అధికారులు బిల్ కలెక్టర్ తో పాటు మధుతో పాటు అతడి సహాయకుడు రమేష్ ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.