హైదరాబాద్: తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (Anti Corruption Bureau) అధికారులు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఐదు గంటలుగా విచారిస్తున్నారు. కేసు దర్యాప్తు అధికారి డీఎస్పీ మజీద్ ఖాన్ ఆధ్వర్యంలో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. కేటీఆర్(KTR) విచారణనను జాయింట్ డైరెక్టర్ రితిరాజ్ పర్యవేక్షిస్తున్నారు. కేటీఆర్ విచారణను వేరే గది నుంచి చూడడానికి న్యాయవాదికి ఏర్పాట్లు చేశారు. 2023 ఫార్ములా-ఈ రేసు కేసులో కేటీఆర్ ను ఏసీబీ ప్రశ్నిస్తోంది. రేసు నిర్వహణలో అర్వింద్ కుమార్ కు ిచ్చిన ఆదేశాలపై ఏసీబీ విచారిస్తోంది. విదేశీ సంస్థకు నగదు చెల్లింపుల్లో కేటీఆర్ ఇచ్చిన ఆదేశాలపై ప్రశ్నిస్తున్నారు.
ఫార్ములా-ఈ రేసు(Formula E race case)లో మాజీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవలప్‌మెంట్ డిపార్ట్‌మెంట్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్(Aravind Kumar) గురువారం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ముందు హాజరయ్యారు. సీనియర్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ (IAS) గురువారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈడీ ప్రాంతీయ కార్యాలయానికి చేరుకున్నారు. అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) దాఖలు చేసిన ప్రథమ సమాచార నివేదిక (First Information Report) ఆధారంగా మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఏ) కింద ఈడీ విచారణ జరుపుతోంది. ఫారిన్ ఎక్స్ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్ (ఫెమా) ఉల్లంఘనలను కేంద్ర ఏజెన్సీ పరిశీలిస్తోంది.