calender_icon.png 25 April, 2025 | 4:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మాజీ డిటిఓ ఇంట్లో ఏసీబీ అధికారుల తనిఖీలు

25-04-2025 11:08:05 AM

మహబూబాబాద్,(విజయక్రాంతి): మహబూబాబాద్ జిల్లా రవాణా శాఖ అధికారి (డీటీఓ)గా పనిచేసిన గౌస్ పాషా ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని కురవి రోడ్డులో మాజీ డిటిఓ గౌస్ పాషా అద్దెకు ఉంటున్న ఇంట్లో శుక్రవారం ఉదయం 8 ప్రాంతంలో ఏసీబీ డీఎస్పీ రమేష్ బాబు(ACB DSP Ramesh Babu) ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. అవినీతి ఆరోపణల నేపథ్యంలో డీటీఓ గౌస్ పాషాను 8 నెలల క్రితం ప్రభుత్వం విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఫిర్యాదుల మేరకు అధికారులు తనిఖీలు చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల తనిఖీతో మళ్ళీ మానుకోట అధికారుల్లో గుబులు రేపింది.