03-04-2025 01:16:08 PM
ఏసీబీ ఆకస్మిక దాడులు..
నిర్మానుషంగా మారిన సరిహద్దు ప్రాంతం
అధికారులను విచారిస్తున్న ఏసీబీ
ప్రైవేట్ వ్యక్తుల వద్ద నగదు లభ్యం
45 వేల రూపాయలు స్వాధీనపరుచుకున్న అధికారులు
కుమ్రం భీం ఆసిఫాబాద్, (విజయక్రాంతి): జిల్లాలోని మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో రాష్ట్ర రవాణా శాఖ చెక్ పోస్ట్(State Transport Department Check Post) వద్ద ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించడంతో సంచలనం రేగింది.బుధవారం రాత్రి ఏసీబీ అధికారులు చెక్పోస్ట్ వద్ద నిఘా పెట్టి మహారాష్ట్ర -తెలంగాణ సరిహద్దు మీదుగా రాకపోకలు కొనసాగిస్తున్న వాహనాల నుండి ఆర్టిఏ చెక్ పోస్ట్(RTA Check Post) వద్ద ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు వసూలు చేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
రవాణా శాఖకు సంబంధం లేని ఇద్దరు వ్యక్తులు వాహనాల నుండి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన ఏసీబీ అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి వద్ద రూ:45100 నగదును స్వాధీన పరచుకున్నట్లు కరీంనగర్ ఏసీబీ డి.ఎస్.పి రమణమూర్తి తెలిపారు.చెక్పోస్ట్ వద్ద ఆకస్మికంగా తనిఖీలు చేపడుతుండగా విధుల్లో ఏఎంవీఐ మాధవి ఉన్నట్లు ఆయన తెలిపారు.అక్రమ వసూళ్లపై ఏసీబీ అధికారులు మాధవి లత ను విచారిస్తున్నారు.వాహనాల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నారు ఐలయ్య ఆలియాస్ రవి, విజయ్ కుమార్ లను ఎసిబి అధికారులు పట్టుకున్నారు.