హైదరాబాద్,(విజయక్రాంతి): గతేడాది హైదరాబాద్ లో నిర్వహించిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్(Formula E-car Racing) వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(BRS Working President, Former Minister KTR)కు అవినీతి నిరోధక బ్యూరో(Anti-Corruption Bureau) అధికారులు మరోసారి నోటీసులు ఇచ్చారు. జనవరి 9వ తేదీన విచారణకు హాజరుకావాలని గచ్చిబౌలి ఓరియన్ విల్లా(Gachibowli Orion Villa)లో కేటీఆర్ కు ఏసీబీ నోటీసులిచ్చారు. ఈ కేసులో ఇప్పటికే ఒకసారి కేటీఆర్ కు నోటీసులివ్వడంతో సోమవారం ఉదయం విచారణ నిమిత్తం ఏసీబీ ప్రధాన కార్యాలయానికి వచ్చారు. ఏసీబీ(ACB) ఆఫీసులో తన వెంటనే వచ్చిన న్యాయవాదిని పోలీసులు అడ్డుకోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయవాదిని అనుమతించబోమని చెప్పాల్సింది మీరు కాదు.. ఏసీబీ అధికారులు అని ప్రశ్నించారు.
న్యాయవాదిని అనుమతించాలని, లేకపోతే ఆయన వెనక్కెళ్తామని కేటీఆర్ చెప్పారు. విచారణకి న్యాయవాదిని పోలీసులు అనుమతించకపోవడంపై ఏసీబీ అధికారుల స్పందన కోసం కార్యాలయం ముందే ఆగిన కేటీఆర్ రోడ్డుపైనే తన స్పందన తెలిపారు. తన స్పందనను రాతపూర్వకంగా ఏసీబీ అధికారులకు అందించిన కేటీఆర్ హైకోర్టు తీర్పు తర్వాత చట్టప్రకారం ముందుకెళ్లాలని సూచించారు. విచారణకు హాజరుకాకుండానే అక్కడి నుండి ఏసీబీ కార్యాలయం నుంచి నేరుగా తెలంగాణ భవన్ కు వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ విచారణకు హాజరుకాకపోవడంతో ఏసీబీ అధికారులు మరోసారి నోటీసులిచ్చారు.