calender_icon.png 12 January, 2025 | 1:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు

03-01-2025 05:26:56 PM

హైదరాబాద్‌: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌(BRS Working President KTR)కు శుక్రవారం ఏసీబీ నోటీసులు జారీ చేసింది. ఈ నెల 6వ తేదీన ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొంది. ఫార్ములా ఈ కార్‌ రేస్‌ కేసులో కేటీఆర్‌కు నోటీసులు అందాయి. ఫార్ములా ఈ రేసులో రూ. 55 కోట్ల గోల్ మాల్ జరిగిందని ఆయనపై ఆరోపణలున్నాయి. కేటీఆర్ హైకోర్టులో వేసిన క్వాష్ పిటిషన్ పై విచారణ పూర్తయి.. తీర్పు పెండింగ్ లో ఉండటంతో తీర్పు వచ్చిన తర్వాతే ఏసీబీ(ACB) చర్యలు తీసుకుంటుందనుకున్నారు. కానీ కేటీఆర్(KTR)కు నోటీసులు జారీ చేయడంతో బీఆర్ఎస్ నాయకులు షాకవుతున్నారు.