హైదరాబాద్,(విజయక్రాంతి): గత ప్రభుత్వం హయాంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ఫార్ములా ఈ-కార్ రేసింగ్ కేసులో ఏసీబీ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేయనున్నారు. ఈ-కార్ రేస్ కేసుకు సంబంధించిన పూర్తి ఆధారాలను ఏసీబీ ఇప్పటికే తెప్పించుకుని పరిశీలిస్తుంది.కేసు విచారణ చేయనున్న ఏసీబీ సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ఈ-కార్ రేస్ పై ఫిర్యాదు చేసిన దానకిశోర్ వాంగ్మూలం నమోదు చేయనుంది. దానకిశోర్ వాంగ్మూలం తర్వాత నోటీసులు ఇచ్చి ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని ఏసీబీ విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఫార్ములా ఈ-కార్ రేసింగ్ వ్యవహారంలో ఏసీబీ కేసు ఆధారంగా దర్యాప్తు చేస్తున్న ఈడీ ఈ-రేస్ లో నగదు వ్యవహారంపైనా మనీలాండరింగ్ కేసు నమోదు చేసింది. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్ఐఆర్, డాక్యుమెంట్లను ఈడీ పరిశీలిస్తుంది.