అమీన్పూర్ : అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. గురువారం గురువారం ఉదయం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయంలో మెదక్ రేంజ్ డిఎస్పి సుదర్శన్ ఆధ్వర్యంలో తనకిని కొనసాగిస్తున్నారు. మున్సిపల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరిగాయని ఫిర్యాదులు రావడంతో ఏసీబీ అధికారులు తనిఖీలు చేస్తున్నట్టు సమాచారం. మెదక్ ఎసిబి డిఎస్పి సుదర్శన్ ఆధ్వర్యంలో 15 మంది అధికారులు పలు రికార్డులు పరిశీలిస్తున్నారని అధికారులు తెలిపారు. మున్సిపల్ పరిధిలో జరిగిన అవినీతి అక్రమాలపై ఫిర్యాదులతో పలు రికార్డులు సీజ్ చేసి తనిఖీ చేస్తున్నట్టు సమాచారం.